భగయత రత్నాలు
1st Lesson Answers
1.చదువగ వలయును జనులకు’ అని పద్యంలో ఉంది కదా ! అంటే మీకేమి అర్ధమయిందో రాయండి?జ.చదువులేనివాడు మంచిచెడ్డలు తెలియని వాడవుతాడు. చదువుకుంటే పని మంచో, ఏది చెడో తెలుసుకోవచ్చు. కాబట్టి మానవులందరూ తప్పకుండా చదువుకోవాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపించి చక్కగా చదివించాలని నాకు అర్ధమయింది
2.అతిథులకు పెట్టని ధనవంతులు దరిద్రులతో సమానమే’. ఎందుకు ?జ.ముందు తెలియజేయకుండా భోజన సమయానికి వచ్చిన వారిని అతిథి అంటారు. అట్లాంటి అతిథి దైవంతోసమానం. అందువల్ల అన్నమైనా, మజ్జిగైనా, నీళ్ళెనా, చివరకు కూరైనా తమకు ఉన్నంతలో అతిథులకు లేదనకుండా భక్తితో పెట్టాలి. అట్లా అతిథులకు పెట్టని ధనవంతులు దరిద్రులతో సమానమే.
3.శాశ్వత కీర్తి అంటే ఏమిటి.ఇందుకోసం ఏం చేయాలి?జ.శాశ్వత కీర్తి అంటే ఒక వ్యక్తి తాను చేసిన మంచి, గొప్ప పనుల వల్ల తాను జీవించి ఉండగానూ, తరువాత కూడా అందరిచేత కీర్తింపబడుట, ఇందుకోసం దానధర్మ తత్పరుడై ఉండాలి. అతిథి అభ్యాగతుల సేవ చేయాలి. నీతి, నిజాయితీ వ్యవహరించాలి. దేశభక్తి, సంఘసేవ, పరోపకారం, అందరి యెడ సమభావం మొదలగు గుణాలు కలిగి ఉండాలి.
4.పరహితునకు నెదురులేదు’ – దీనిని సమర్థిస్తూ రాయండి.జ. పరహితుడు అంటే ఇతరులకు మేలు చేసేవాడని అర్థం. ఇతరులకు మేలు చేసేవాడు పంచభూతాలకు, జీవరాసులకు హితుడవుతాడు. పరహితమే గొప్ప ధర్మం. అందుకే పరహితునకు ఎక్కడా ఎదురుండదు.
5.పరహితం’ అంటే ఏమిటి? ఇందుకోసం ఏమేమి పనులు చేయవచ్చు?జ.జనరహిత’ అది ఇతరులకు మేలు చేయడం.. ఇందుకోసం ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి. వారి సోభాది గుర్తించి బాసధర్మాలు చేయవచ్చు. మంచి సలహాలు ఇవ్వవచ్చు. ఇంకా అనేక విధాల వారి అందగా ఉండవచ్చు.
6.శ్రేష్ఠులైన గురువులని ఎవరిని అంటారు ? ఇలాంటి వారివద్దనే ఎందుకు చదువుకోవాలి.
జ.విద్యార్థుల స్థాయిని బట్టి తన బోధనను ఎప్పటికప్పుడు పరిశీలించుకొంటూ, అందరికి అర్థమయ్యే రీతిలో బోధించేవారినే శ్రేష్ఠులైన గురువులు అంటారు పాఠ్యాంశాలతో పాటు సహ పాఠ్యాంశాలు, అదనపు Iవిద్యార్థులు అంతర్లీనంగా ఉన్న సృజనాత్మకతను వెలుగులోకి తెచ్చేవారే శ్రేష్ఠులైన గురువులుపాఠ్యాంశాలు కూడా బోధిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేవారే శ్రేష్ఠులైన గురువులు.విద్య, వివేకం, స్వీయ క్రమశిక్షణ, బోధన నైపుణ్యం కలవారే శ్రేష్ఠులైన గురువులు. విద్యార్థుల స్ఫూర్తిదాతలుగా వారి మనస్సులలో నిలిచిపోగలిగినవారే శ్రేష్ఠులైన గురువులు ఇలాంటి వారివద్ద చదువుకుంటే విజ్ఞానంతోపాటు దేశభక్తి, పెద్దలయెడల గౌరవం, సోదరప్రేమ, సామాజిక విలువలు, నైతిక విలువలు, ధార్మిక విలువలు, క్రమశిక్షణ మొదలగునవి అలవడతాయి
7.నిరక్షరాస్యత నిర్మూలనకు వేసుకున్న ప్రణాళికను వివరిస్తూ మిత్రునకు లేఖ రాయండి?
భీమ్గల్ xxxxxxxప్రియ మిత్రురాలు పద్మకు,నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని తలుస్తాను. నేను ఈ లేఖలో నిరక్షరారం నిర్మూలనకు వేసుకున్న ప్రణాళికను గురించి తెలియజేస్తున్నాను.పిల్లలందరిని పాఠశాలలో చేర్పించే కార్యక్రమం చేపట్టాలి. బాల కార్మికులను గుర్తించి వారిని కూడా ఈ చేర్పించాలి. నిరక్షరాస్యులైన వయోజనులను ప్రోత్సహించిన చదువు నేర్చేటట్లు చేయాలి. కనీసం చదువు వ్రాయడం, లెక్కలు చూడటమైనా వచ్చేలా చేయాలి. పాఠ్య గ్రంథాలు అందమైన చిత్రాలతో ఆకర్షణీయ డా ఉండేలా చూడాలి. భార్య గ్రంథాలను అందరికీ ఉచితంగా అందజేయాలి. గ్రామాలలో గ్రంథాలయాలు రాజు చేయాలి. అవసరమైన చోట రాత్రి పాఠశాలలు నెలకొల్పారు.
ఈ విధంగా నిరక్షరాస్యతా నిర్మూలనకు నేను కొన్ని ప్రణాళికలను వేసుకున్నాను తెలియజేయడానికిసంతోషిస్తున్నాను.
ఇట్లు,
నీ ప్రియమైన మిత్రులరా,
అగ్గ రాజు శ్రీవిద్య
చిరునామా:జి. పద్మ, 10వ తరగతి,శ్రీగీత కాన్వెంట్ హై స్కూల్,నందిపేట్, నిజామాబాద్.
0 comments:
Post a Comment