1.ఆణిముత్యాలుTelugu9th
ఆణిముత్యాలు
ఆలోచించండి - చెప్పండి
1.చెడ్డవారి స్వభావం ఎట్లా ఉంటుంది ?
జ. చెడ్డవారు వినయం నటించి ఎదుటివారిని మోసం చేయాలి అని చూస్తారు. తాను చేయలేకపోయినా చేస్తానని ప్రతిజ్ఞ చేయటం (శపథములు), లేని వినయాన్ని నటిస్తూ చేతులు జోడించటం (అంజలి అభివాదము), దోషాలైనప్పటికి, దోషాలను చూపించక, గొప్పగా పొగడటం, (సామప్రియ భాషలు), మనస్సులో గౌరవం లేకుండా గౌరవంగా నటించటం (మిథ్యా వినయములు) వంటివి నయవంచనలు. దుర్మార్గులు ప్రదర్శిస్తారు
2.చెడ్డవారికి గర్వాన్ని కలిగించేవి ఏవి ?
జ. తాతలు, తండ్రులు చేసిన పుణ్యకార్యాలు, గొప్ప పనుల వల్ల వంశము పేరు ప్రతిష్ఠలు పొంది గొప్ప వంశంగా కీర్తి పొందుతుంది. దుర్మార్గుడు ఆ పనులన్నీ తానే చేసినట్లు గర్వాన్ని పొందుతాడు
అట్లాగే ధనము, విద్యలు సంపాదించినప్పుడు గర్వాన్ని పొందుతాడు. ధనము, వంశము వల్ల దుర్యోధనుడు, రావణుడు, విద్య వల్ల కర్ణుడు, గర్వాన్ని పొంది, పెద్దలతో విరోధం తెచ్చుకొన్నారు
3. దయగలవారు ఏం చేస్తారు ?
జ., తన శత్రువైనప్పటికి శరణంటూ వచ్చిన వారిని దయగల వారు రక్షిస్తారు. ప్రాణులను రక్షించటమే ధర్మములలో ఉత్తమ ధర్మం, (శరణు అని వచ్చిన విభీషణుడు శత్రు పక్షము వాడైనప్పటికి శ్రీరాముడు శరణమిచ్చాడు కదా)
4.దానధర్మాలు ఎందుకు చేస్తారు ? ఏమేమి దానం చేయవచ్చు ?
జ.
దానము : ధన, వస్త్రాలు లేనివారికి, బీదవారికి దానం చేస్తాము. దానం చేయటం వల్ల, ఇతరులకు ఉపకారము, మనకు పుణ్యము వస్తుంది. కీర్తి కోసం కొందరు దానాలు
చేస్తారు.
ధర్మ కార్యాలు : అందరి ఉపయోగం కోసం బావులు తవ్వించటం, సత్రాలు కట్టించటం, పెళ్ళిళ్ళు చేయించటం వంటివి ధర్మ కార్యాలుగా చెప్పుకొంటాం
దానధర్మాల వల్ల పుణ్యం లభిస్తుంది. కీర్తి వస్తుంది దానధర్మాల వల్ల మన సంపదకు రక్షణ కలుగుతుందని నీతిశాస్త్రం చెబుతుంది
వస్తువులు, ధనం, ఆవులు, భూమి, వస్త్రాలు, బంగారం వంటివి దానం చేయవచ్చు. అన్ని దానాలలోకి అన్నదానం, విద్యాదానం గొప్పవి అని అంటారు.
5.దానం చేయని ధనం వ్యర్థం' ఎందుకు ?
జ.అందరూ ధనం సంపాదించాలని కోరుకొంటారు. ధనం సంపాదించిన తరువాత దానాలు చేయాలి. ఎందుకంటే ప్రతి మనిషి ధనంతో పాటు కీర్తిని సంపాదించాలి. దానం వలన కీర్తి వస్తుంది. సమాజం నుండి పొందిన ధనం ఆ సమాజం అభివృద్ధికి కొంత దానం చేయాలి ఇది ధర్మం .
దాచిపెడితే దొంగల పాలవుతుంది. పిసినారి అనే అపకీర్తి వస్తుంది. అందరూ దూరమౌతారు. దానం చేస్తే దాత అని పొగడుతారు. కాని శక్తికి మించకుండా దానం చేయాలి. యోగ్యులకు దానం చేయాలి దానంలో కూడ విద్యాదానం, అన్నదానం చేస్తే పొందినవారు ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉంటారు బాగుపడతారు
6. 'విద్య గొప్పదనం' ఎట్లో చెప్పండి.?
జ. విద్య అనే ధనంలో అన్నదమ్ములు భాగం కోరలేరు. విద్య అనే ధనం రహస్యంగా ఉంటుంది. దొంగలకు కనిపించదు. రాజులు కూడా విద్యాధనం కలవారిని గౌరవిస్తారు. విద్య కీర్తిని కలిగిస్తుంది. విద్య సకల భోగాలను తెచ్చి పెడుతుంది. యుగాంతం అయినా విద్య నిలిచి ఉంటుంది. విదేశాలకు వెళ్ళినప్పుడు తోడుగా ఉండే స్నేహితుడు విద్యే. విద్య, వివేకము, వినయమునిచ్చి కష్టాలను తొలగిస్తుంది. కాబట్టి విద్యాధనమే గొప్పధనము. విద్యాధనమును ఎంత దానం చేసినా పెరుగుతుందే కాని తరగదు
1. చెడ్డవాళ్ళను ఎట్లా గుర్తించవచ్చు?
జ.చెడ్డవాళ్ళు వాళ్ళు చెప్పేది నిజం అని నమ్మించటానికి మాటిమాటికి ప్రమాణాలు (ఒట్లు) చేస్తుంటారు. లేని వినయంతో
వంగి వంగి దండాలు పెట్టారు. మన పొరపాట్లు చెప్పకుండా అన్నింటికి పొగుడుతుంటారు. మనల్ని ఉబ్బించటానికి ప్రయత్నిస్తారు.
2. చెడ్డవాళ్ళకు గర్వం వేటివల్ల కలుగుతుంది ? ఎందుకు ?
జ. ధనం, చదువు, కులగౌరవాలు, చెడ్డవాళ్ళకు గర్వం వచ్చేట్టు చేస్తాయి. ధనం, చదువు, కుటుంబగౌరవం ఉంటే, ప్రజలు వారి పట్ల గౌరవంగా ఉంటారు. దీనితో మనం వాళ్ళకంటే గొప్ప అనే గర్వం వస్తుంది. గర్వంతో మిగతావాళ్ళ పట్ల చులకన భావం కలుగుతుంది. కాబట్టి ధనం, చదువు, కుటుంబగౌరవం ఉన్నవాళ్ళు జాగ్రత్తగా, వినయంగా ఉండాలి
3.దొంగలకు దొరకని ధనం విద్య ! ఎట్లాగో వివరించండి ?
జ. పూర్వం అడవి మార్గాల గుండా ప్రయాణించవలసి వచ్చేది. దారి దోపిడీ దొంగలు ధనము, బంగారము, ఆభరణాలు
కట్టు వస్త్రాలు కూడ దోచుకొనేవారు. కాని విద్య మెదడులో దాగి ఉంటుంది. దానిని దోచుకోవటం వారికి సాధ్యం కాదు
కాబట్టి దొంగలకు కూడ దొరకనిది విద్య అనే నానుడి వచ్చింది. ప్రాణాలు తీసినా విద్య వాళ్ళకు దొరకదు కదా !
4.పశువుకంటే హీనుడు ఎవరు ? ఎందుకు?
జ, మనదేశ సంప్రదాయం ప్రకారం తాను సంపాదించిన దాంట్లో కొంతైనా ఇతరులకు దానం చేస్తారు. ఇతరులకు పెట్టక తాను ఒక్కడే తినేవాణ్ణి పశువు కంటే హీనుడు అంటారు. ఎద్దులు, దున్నలు, తమ గడ్డి సంపాదించుకోవటంతో పాటు మనిషికి ధాన్యాన్ని, పొలం దున్ని పంటలను పండించి ఇస్తాయి. బండ్లు లాగి కష్టపడతాయి. కాబట్టి తాను ఒక్కడే తినేవాణ్ణి పశువు కంటే హీనం అంటాం.
ఆ) కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి
1.మనం నిత్యజీవితంలో పాటించవలసిన ఎన్నో మంచి విషయాలు శతక పద్యాల్లో ఉంటాయి. ఎట్లాగో వివరించండి.
జ.వేమన, సుమతీ, కుమారీ, కుమారా వంటి శతకాల్లో మనం నిత్యజీవితంలో పాటించవలసిన విషయాలు ఉంటాయి. తల్లిదండ్రులను గౌరవించటం, అబద్ధం ఆడరాదు అని, అందరు కలిసిమెలిసి ఉండాలి అని నిత్యం మనం చేయవలసిన
వాటి గురించి ఉంటాయి,దుష్టుల సహవాసం మంచిది కాదని, అడిగిన జీతం ఈయని పిసినారిని కొలువు చేయవద్దని, మూర్ఖునితో స్నేహం
ప్రాణాంతకం అవుతుందని వంటి జాగ్రత్తలు శతకాలలో ఉంటాయి. మనిషిగా జన్మించినందుకు ధనము, విద్య, యశస్సు పొందాలని చెప్తాయి. కార్య సాధకుడు కష్టసుఖాలను సమానంగా చూడాలని, లక్ష్యం చేరాలని ఉత్సాహపరుస్తాయి.
ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొర నిందసేయ బోకుము కార్యా
లోచన ములొంటిఁజేయకు
మాచారము విడువ బొకుమయ్య కుమారా !
పై పద్యంలో గురువును ఎదిరించరాదని, కాపాడిన వారిని మరవవద్దని, చెడుగా మాట్లాడవద్దని, మంచి ఆలోచన నలుగురితో కలిసి చేయాలని, ఆచారం పాటించాలని చెప్పటం, మనం ప్రతిదినం చేయవలసినవే కదా !
సృజనాత్మకత ప్రశంస
1. మీ పాఠశాలలో జరుగబోయే పద్యాల పోటీ కార్యక్రమంలో ఇతర పాఠశాలల విద్యార్థులను ఆహ్వానిస్తూ ఒక ఆహ్వాన పత్రం తయారుచేయండి. ప్రదర్శించండి.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
మండీ బజార్ - వరంగల్
పద్యాల పోటీకి ఆహ్వానము
తేది : XXXXX, గురువారము
పాఠశాల...............గారికి
గ్రామం......................
ఆర్యా !
మా పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అన్ని పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు పద్యాల పోటీలు నిర్వహిస్తున్నాము. ఈ పోటీలు మా పాఠశాల ఆవరణలో తేది : XXXXX ఆదివారం ఉదయం పదిగంటల నుండి ప్రారంభమగును
ఈ పోటీలు రెండు విధాలుగా ఉంటాయి. 1) అంత్యాక్షరి, 2) పదాల తోరణం. ఉన్నత, ప్రాథమిక విద్యార్థులకు
పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు, స్వాతంత్ర్య దినోత్సవ సభలో బహుమతులు ఇవ్వగలము. ఈ పోటీలలో విడివిడిగా ఉంటాయి
పాల్గొనదలచిన విద్యార్థులందరికి మా ఆహ్వానం.
ఇట్లు,
విద్యార్థి బృంద నాయకుడు,
ప్రవీణ్ కుమార్.
Part-B
ఆ) కింది వాక్యాల్లో గీత గీసిన ప్రకృతి పదాలకు వికృతులు రాయండి.
1.విద్య లేని వాడిని వింత పశువు అంటారు. జ. విద్దె, విద్దియ
2.తన పొట్ట మాత్రమే నింపుకోవాలని ఆలోచించేవాడు పశువు. జ. పసరము
3.శ్రీరాముడు తండ్రి ఆజ్ఞ ప్రకారం అడవులకు వెళ్ళాడు. జ. ఆన, ఆనతి
అ) కింది వాక్యాల్లో గీత గీసిన పదాలు ఏ భాషాభాగాలో గుర్తించండి
1.రహీం హైదరాబాద్ కు వెళ్ళాడు. (నామవాచకం )
2.ఆమె బడికి వెళ్ళింది (సర్వనామం )
3.మధు పాఠశాలకు వెళుతున్నాడు. (క్రియ )
4.కుక్క విశ్వాసం గల జంతువు (నామవాచకం )
5.అది కొబ్బరి చెట్టు (సర్వనామం)
ఆ) కింది వాక్యాలు చదువండి. విశేషణాల కింద గీత గీయండి.
1. ఏనుగు పెద్ద జంతువు.
2.తాటి చెట్టు పొడవుగా ఉంటుంది
3.చిలుక అందమైన పక్షి
4.కాటుక నల్లగా ఉంటుంది
5.పులి క్రూర జంతువు
జ. 1. ఏనుగు పెద్ద జంతువు,
2. తాటి చెట్టు పొడవుగా ఉంటుంది
3.చిలుక అందమైన పక్షి
4. కాటుక నల్లగా ఉంటుంది.
5. పులి క్రూర జంతువు.
0 comments:
Post a Comment