1.చదువుదాం
అ) గేయాన్ని రాగంతో పాడండి
జ.ఉపాధ్యాయుడు పర్యవేక్షణలో గేయాన్ని రాగయుక్తంగా పాడడం నేర్చుకోండి.
ఆ) ఈ గేయం ద్వారా మీరేమి తెలుసుకున్నారు
జ.దాశరథి కృష్ణమాచార్యులు 'చదువుదాం' గేయం ద్వారా సమాజంలో మనుషులు ఎలా మెలగాలో చక్కగా తెలియజేశారు. చదువు ద్వారానే మనిషి ఎదుగుదల బాగుంటుందని, కల్మషం లేకుండా అందరు కలిసి ఒకటిగా మెలగాలని, సాంకేతిక విజ్ఞానం దేశాభివృద్ధికి దోహదపడుతుందని అహింసా మార్గంలో నడవాలని, తోటివారి బాధల్లో పాలు పంచుకోవాలని, ప్రకృతిని కాపాడుకోవాలని తెలుసుకున్నాను.
III స్వీయరచన
అ) కింది ప్రశ్నలకు మూడేసి వాక్యాల్లో జవాబులు రాయండి కరువు కాటకాలు లేకపోవడం అంటే ఏమిటి?
జ., కరువు, కాటకం అనే పదాలకు 'క్షామం' అంటే నిఘంటువు అర్ధం. సకాలంలో వర్హాలు లేనపుడు పంటలు పండని
వర్షాలు స్థితిని "కరువు" "కాటకం" అని అంటారు. ప్రజలకు తిండి లేని స్థితిని 'కరువు కాటకాలు" తెలియజేస్తుంది. కరువు కాటకాలు లేకపోవడం అంటే చక్కని వర్షాలు నేల తడిచి, మంచి పంటలు పండి. ప్రజలు సంతోషంగా ఉండటం అని చెప్పవచ్చు.
2.అహింసా మార్గంలో ఎందుకు నడవాలి?
జ. ఇతరులను బాధించడాన్ని లేదా చంపడాన్ని 'హింస' అంటారు. ఇలా చేయడం వల్ల చివరకు ఎవరూ మిగలరు. పరపీడనం పాపం' అని పెద్దల మాట. సంఘజీవి అయిన మానవుడు నలుగురితో కలిసి జీవించడం నేర్చుకోవాలి.
తోటి ప్రాణి పట్ల జాలి, దయతో ప్రవర్తించాలి. "అహింసా పరమో ధర్మః” అని మహాభారతం చెబుతోంది
హింసను వీడి అహింసా మార్గంలో నడిచి చూపిన మహాత్ముడు గాంధీజీ. మనిషి మనిషిగా జీవించాలంటే అహింసా మార్గంలో నడవాల్సిందే
ఆ) కింది ప్రశ్నకు ఆరు వాక్యాల్లో జవాబు రాయండి
1.గేయ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి?
జ. 'చదువుదాం' గేయం ద్వారా కవి సమాజంలో చక్కని మార్పును కోరుకుంటున్నారు. బాగా చదువుకొని, సమాజంలోని అసమానతలను రూపుమాపాలి. ప్రాంతీయ భేదాలు, కులమత విభేదాలు విడిచిపెట్టి ప్రతి ఒక్కరు దేశ సేవకై నడుం బిగించాలి సాంకేతికంగా ఎదిగి మన పూర్వికులు చేసిన ప్రయోగాలను కొనసాగించి చంద్రమండల, సూర్యమండల రహస్యాలను తెలుసుకొని లోకానికి మేలు కలిగేలా చూడాలి. హింసను విడనాడి నలుగురితో కలిసిమెలసి జీవించాలి. పెద్దలు చూపిన అహింసా మార్గంలో నడవాలి. బాధల్లో ఉన్నవారికి తోడుగా నిలవాలి. కరువు కాటకాలు లేని సమాజాన్ని పునఃనిర్మించాలి.
AMAZING
ReplyDelete